కోలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా చేస్తున్న చంద్రముఖి-2 చిత్ర షూటింగ్ పూర్తి అయింది. రజనీకాంత్, జ్యోతిక, నయనతార ఇంకా ప్రభు ప్రధాన పాత్ర పోషించిన చంద్రముఖి సినిమా 2005లో విడుదలైంది.అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన చంద్రముఖి సినిమాని పి.వాసు డైరెక్ట్ చేశాడు.ఈ సినిమా తమిళ్ లో అప్పటివరకు వున్న అన్ని రికార్డులని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా రజినీకాంత్ ఎంతో ఇష్టపడి చేసిన బాబా సినిమా ప్లాప్ బాధని తీర్చి ఆయనకి స్ట్రాంగ్ కం బ్యాక్ హిట్ గా నిలిచింది.అయితే ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని వాసు ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ ఉన్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్ అంగీకరించకపోవడంతో అదే కథతో తెలుగులో వెంకటేష్ కథానాయకుడిగా నాగవల్లి సినిమాని తెరకెక్కించారు.అయితే 18 ఏళ్ల తరువాత చంద్రముఖి -2ను తమిళంలో తీస్తున్నారు. అయితే ఇందులో రజనీకాంత్‌కు బదులుగా తమిళ స్టార్ నృత్య దర్శకుడు, నటుడు ఇంకా దర్శకుడు లారెన్స్ నటించడం విశేషం.
బాలీవుడ్ సంచలన నటి అయిన కంగనా రనౌత్ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో వడివేలు, రాధిక ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన పి.వాసు తెరకెక్కిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం నాడు పూర్తయింది. ఇంకా ఈ విషయాన్ని చిత్ర వర్గాలు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న చంద్రముఖి-2 సినిమాపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.దానికి కారణం రజనీకాంత్ పాత్రను లారెన్స్ పోషించడం ఇంకా జ్యోతిక పాత్రలో కంగనారనౌత్ నటించడంతో పాటు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించడమే అని సమాచారం తెలుస్తుంది.ఇక చూడాలి ఈ చంద్రముఖి 2 సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..