జులై చివరి వరకు విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
జులై చివరి వరకు విడుదల కాబోయే కొన్ని క్రేజీ సినిమాల వివరాలను తెలుసుకుందాం.

స్పై : నిఖిల్ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా గర్రి బి హెచ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 29 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కాబోతుంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సామజవరగమన : శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ఈ సినిమాను జూన్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.

రంగబలి : నాగ శౌర్య హీరో గా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చేరుకొరి నిర్మించిన ఈ సినిమాను జూలై 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో పర్వాలేదు అని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

బేబీ ది మూవీ : ఈ మూవీ ని జూలై 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో పరవాలేదు అనే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

ఊరు పేరు భైరవకోన : సందీప్ కిషన్ హీరోగా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జూలై 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

బ్రో : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో సాయి తేజ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా కనిపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: