ఆ మూవీల టైమ్ లో టికెట్ ధరలు తగ్గించారు... దానితో 30 కోట్ల భారాన్ని నేను భరించాను... పవన్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ ఇప్పటికే ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నప్పటికీ రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ప్రజా సమస్యలపై కూడా పోరాటం చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.


తాజా ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ... నేను హీరోగా రూపొందిన వకీల్ సాబ్ ... భీమ్లా నాయక్ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలను తగ్గించారు. టికెట్ ధర పది రూపాయలు పెడితే పెట్టుబడి ఎప్పటికీ తిరిగి వస్తుంది. ఆ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి టాక్ లభించింది. అలాగే ఆ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ సినిమాల ద్వారా నిర్మాతలకు నష్టాలు వచ్చాయి. దానితో ఆ మూవీ ల ద్వారా 30 కోట్ల భారాన్ని నేను భరించాను అని తాజా ఇంటర్వ్యూ లో బాగంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా ... ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు.


శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక భీమ్లా నాయక్ సినిమాలో పవన్ తో పాటు దగ్గుపాటి రానా కూడా హీరో గా నటించాడు. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు  ఇక ప్రస్తుతం పవన్ ... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాలోను ... హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోను ... సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" సినిమాల్లోని హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: