శ్రీలీల దెబ్బకు షాక్ లో పూజ హెగ్డే !

Seetha Sailaja
శ్రీలీల నటించిన సినిమాలు ఇప్పటికీ కేవలం రెండు మాత్రమే విడుదల అయ్యాయి. ఆ రెండు సినిమాలలో మొదటి సినిమా ఫ్లాప్ అయితే రెండవ సినిమా మాత్రమే హిట్ అయింది. అయితే ఆ ఒక్క హిట్ ఆమె జాతకాన్ని మార్చేయడంతో ఎన్నో భారీ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.


మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘గుంటూరుకారం’ మూవీలో మొదట పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ అయితే శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా మాత్రమే ఎంపిక అయింది. ఇప్పటికే మహేష్ పూజా హెగ్డే శ్రీలీల పై కొన్ని సన్నివేశాలు తీయడం కూడ జరిగింది. అయితే ఇప్పుడు ఈమూవీ నుంచి పూజా హెగ్డేను తప్పించి శ్రీలీల ను మెయిన్ హీరోయిన్ గా మార్చారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఒక వార్తా వైరల్ అవుతోంది.


ఈమూవీ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు త్రివిక్రమ్ మనసులో పూజా హెగ్డే ఉండటంతో ఆమె పాత్రకు ప్రాధాన్యత కల్పించి మొదట్లో త్రివిక్రమ్ ఈమూవీ స్క్రిప్ట్ ను లక్ చేసినట్లు టాక్. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని త్రివిక్రమ్ సలహాతో శ్రీలీల గోల్డెన్ లెగ్ ను ఆధారంగ చేసుకుని ఈమూవీ ఘాట్ విషయంలో ముందుకు వెళ్లారు అని టాక్. ఇప్పుడు ఈమూవీ రేంజ్ మారడంతో శ్రీలీల వైపు మహేష్ ఈమూవీ నిర్మాతలు ముందడుగు వేయడంతో మహేష్ శ్రీలీల ల కాంబినేషన్ పూర్తిగా సెట్ అయిందని సమాచారం.


ఇప్పటికే వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న పూజా హెగ్డే కు ఇది ఊహించని షాక్. ఇప్పటికే రకరకాల సమస్యలు వల్ల ఈ మూవీ షూటింగ్ అనుకున్న విధంగముందుకు నడవని పరిస్థితులలో జాతకాలు ముహూర్తా లపై చాలా నమ్మకం పెట్టుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తన సినిమా విషయంలో ఇన్ని సమస్యలు ఏమిటి అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. మహేష్ మూవీలో కూడ పూజా హెగ్డే కు ఎదురు దెబ్బ తగలడంతో టాప్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు ఆమెకు
మరిన్ని తగ్గే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: