జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా బుల్లితెర , వెండితెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఎంతో మంది బుల్లి తెర అభిమానులను సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. అలా సినిమాల ద్వారా ఎంతో మంది వెండి తెర ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ నటుడు ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు.
అందులో భాగంగా మొదటగా సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినాప్పటికీ ఆ సినిమాలు కూడా సుధీర్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందించలేదు. ఇది ఇలా ఉంటే అలాంటి సమయం లోనే ఈ నటుడు గాలోడు అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వం వహించాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను అల్లరించడానికి రెడీ అయింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.