తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ మూవీ జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం ... ఈ మూవీ లో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి ప్రభాస్ హీరోగా నటించడం ... అలాగే ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి ఓం రౌత్ దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 249 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇలా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 242 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. అలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.
ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 163.45 కోట్ల షేర్ ... 326.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. దానితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 78.55 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మల ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.