4 రోజుల్లో "ఆది పురుష్" మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కృతి సనన్ ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించింది. ఈ మూవీ జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ నాలుగు రోజుల్లో నైజాం ఏరియాలో 32 కోట్ల కలక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ ఏరియాలో 8.14 కోట్లు ,  యు ఏ లో 8.90 కోట్లు ,  ఈస్ట్ లో 5.16 కోట్లు ,  వేస్ట్ లో 3.66 కోట్లు ,  గుంటూరు లో 6.11 కోట్లు ,  కృష్ణ లో 3.88 కోట్లు ,  నెల్లూరు లో 1.91 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 69.76 కోట్ల షేర్ ... 110.40 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసింది. 
ఈ మూవీ నాలుగు రోజుల్లో కర్ణాటక ఏరియాలో 10.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ,  తమిళ నాడు ఏరియాలో 2.06 కోట్ల కలక్షన్ లను ,  కేరళ లో 72 లక్షల కలక్షన్ లను ,  హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 59.20 కోట్ల కలెక్షన్ లను ,  ఓవర్ సీస్ లో 20.90 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. 

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 163.45 కోట్ల షేర్ ... 326.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలక్షన్ లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: