"లియో" మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమోకు సాలిడ్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
తలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇది వరకు విజయ్ ... త్రిష కాంబినేషన్ లో ఎన్నో మూవీ లు రూపొందాయి. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత విజయ్ ... త్రిష కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ జంటను వెండి తెరపై చూడాలి అని చాలా మంది తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.
 


మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క  ప్రచారాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ అయినటువంటి "నా రెడీ" అనే లిరికల్ వీడియో సాంగ్ ను జూన్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.


ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని మొదటి సింగిల్ అయినటువంటి "నా రెడీ" అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది. ఈ ప్రోమో సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ పాట యొక్క ప్రోమో విడుదల అయిన గంట సమయం లోనే 1.4 మిలియన్ వ్యూస్ ... 329 కే లైక్స్ లభించాయి.  ఇలా ఈ సాంగ్ ప్రోమోకి ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: