బుల్లితెరపై ఆరోజు ప్రసారం కానున్న ధమాకా మూవీ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ హీరోగా పోయిన సంవత్సరం మూడు సినిమాలలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో ఖిలాడి ... రామారావు ఆన్ డ్యూటీ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరచగా ... ధమాకా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈ మూవీ లో శ్రీ లీల ... రవితేజ సరసన హీరోయిన్ గా నటించగా ... త్రినాధ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.


ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ లో ఒకటి అయినటువంటి స్టార్ మా సంస్థ దక్కించుకుంది.


అందులో భాగంగా ఈ సినిమాను జూన్ 24 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రవితేజ నటన తో పాటు శ్రీ లీల నటనతో పాటు డాన్స్ కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీతో శ్రీ లీల క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ లో పెరిగి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: