స్నేహితుడి కొడుకు భాధ్యత స్వీకరించిన చిరంజీవి !

Seetha Sailaja
ఈనాటి తరం ప్రేక్షకులు నటుడి  సుధాకర్ పేరు మరిచిపోయి ఉంటారు. అయితే 2000 సంవత్సరం వరకు తెలుగుసినిమాలు రెగ్యులర్ గా చూసిన ఆనాటితరం ప్రేక్షకులకు సుధాకర్  గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. హీరోగా  ఇండస్ట్రిలోకి ఎంట్రీ ఇచ్చి ఆతరువాత కమెడియన్ గా మారిన సుధాకర్ అనేక తెలుగు సినిమాలలో నటించాడు.


ఒక ప్రత్యేకమైన మాడ్యులేషన్స్ తో డైలాగ్స్ చెప్పే సుధాకర్ అప్పట్లో చెప్పిన పితుహూ అబ్బబ్బా అంటూ డైలాగ్ లకు ఆరోజులలో ధియేటర్లు చప్పట్లతో మారుమ్రోగి పోయేవి. ‘యముడికి మొగుడు’ ‘పెద్దరికం’ ‘సుస్వాగతం’ ‘రాజా’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అతడు నటించాడు. చిరంజీవి సుధాకర్ లు ఒకే ఫిలిమ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్న నాటి నుండి వారిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే కాకుండా ఒకే రూమ్ లో కలిసి ఉండేవారు.


చిరంజీవి బజారుకు వెళ్ళి కూరలు సరుకులు కొని తీసుకు వస్తే సుధాకర్ అప్పట్లో వంట చేసేవాడు. అయితే ఆతరువాత కాలంలో చిరంజీవి టాప్ హీరోగా మారిపోయిన తరువాత సుధాకర్ కు తన సినిమాలలో కామెడీ రోల్స్ వచ్చేవిధంగా దర్శకులకు అతడి పేరును చెప్పేవాడు అని అంటారు. అయితే సుధాకర్ కు కొన్ని సంవత్సరాల క్రితం తీవ్రమైన అనారోగ్యం రావడంతో సినిమాలకు దూరం అయినప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది.  


సుధాకర్ కు కొడుకు ఉన్నాడు అతడి పేరు బెనెడిక్ మైఖేల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేసిన ఇతను ప్రస్తుతం అమెజాన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నటనంటే బాగా ఇష్టమున్న అతడికి నటుడుగా రాణించాలి అన్న పట్టుదల ఉండటంతో ఆవిషయం చిరంజీవి దృష్టి వరకు రావడంతో అతడికి అవకాశాలు ఇవ్వమని చిరంజీవి తనకు తెలిసిన దర్శక నిర్మాతలకు అవకాశం వచ్చినప్పుడల్లా చెపుతున్నాడట. ఈవిషయాన్ని సుధాకర్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. దీనితో ఇతడి అదృష్టం ఎలా ఉంటుందో రానున్న రోజులలో తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: