టాలీవుడ్ సూపర్ క్రేజీ హీరోల మూవీ షూటింగ్ వివరాలు ఇవే..!

frame టాలీవుడ్ సూపర్ క్రేజీ హీరోల మూవీ షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ... బాలకృష్ణ ... విజయ్ దేవరకొండ ... విశ్వక్ సేన్ ల మూవీ లు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి . ప్రస్తుతం వీరి మూవీ ల షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ బృందాలు ఈ సినిమాలకు సంబంధించిన ఏ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనే విషయాలను తెలు సుకున్నాం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగు తుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఎన్టీఆర్ పై సముద్రంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తుం ది.

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంతు కేసరి అనే సినిమా లో హీరోగా నటిస్తున్నాడు . శ్రీ లీల ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కొండాపూర్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం బాలకృష్ణ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నారు. ఈ మూవీ విజయ్ కెరీర్ లో 12 వ మూవీ గా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం విజయ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

విశ్వక్ సేన్ ప్రస్తుతం తన కెరీర్ లో 11 వ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాజమండ్రి లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం విశ్వక్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: