సినిమాల పండుగ !
దీనితో ఇండస్ట్రీ వర్గాలలో జోష్ పూర్తిగా తగ్గిపోయింది. అయితే జూలై నుండి ప్రారంభం కాబోతున్న ఈసంవత్సరానికి సంబంధించిన అర్థ సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తిగా జోష్ లోకి వెళ్ళిపోవడం ఖాయం అంటున్నారు. జూలై నెలలో పవన్ కళ్యాణ్ మూవీ ‘బ్రో’ నుండి మొదలుకాబోతున్న టాప్ హీరోల పెద్ద సినిమాల జాతర ఈసంవత్సరం చివరివరకు కొనసాగే ఆస్కారం ఉంది.
2023 ఆగస్టు నుంచి భారీ సినిమాల తాకిడి చాలా బలంగా ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ను ప్రకటించి ఆదిశగా పరుగులు పెడుతున్నాయి. ప్రతి హీరో చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈసంవత్సరం సమ్మర్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ టాప్ హీరోలు అంతా సమ్మర్ ను కూడ లెక్క చేయకుండా షూటింగ్స్ లో బిజీగా ఉంటున్నారు.
ఈ రాబోయే అర్థ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి బాలకృష్ణ నాని విజయ్ దేవరకొండ ప్రభాస్ లతో పాటు చాలామంది హీరోల సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి దసరా సీజన్ కు అనేక టాప్ హీరోల సినిమాలు క్యూ కడుతున్నాయి. మరోపక్కన తమిళ మళ యాళ హీరోల సినిమాలు కూడా తెలుగులో రెడీ కాబోతున్నాయి. చిన్న పెద్ద సినిమాలు కలిపి సుమారు 150 వరకు రాబోతున్న అర్థ సంవత్సరంలో రాబోతాయి అంటూ వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. దీనితో కనీసం రాబోతున్న అర్థ సంవత్సరంలో అయినా ఇండస్ట్రీ కళకళలాడితే బాగుంటుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..