సలార్.. సినిమా టీజర్ వచ్చేది అప్పుడేనా..?

Divya
సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎటువంటి హీరో అయినా వరుసగా సినిమాలు చేయాలనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా స్టార్డం వచ్చిన తర్వాత స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటిది టాలీవుడ్లో కొంతమంది హీరోలు మాత్రం వరుసగా పలు చిత్రాలను తెరకెక్కిస్తూ సత్తా చాటుతూ ఉన్నారు. అలాంటి వారిలో ప్రభాస్ కూడా ఒకరు పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరుపొందిన ప్రభాస్ ప్రస్తుతం నాలుగైదు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో సలార్ చిత్రం కూడా ఒకటి .ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తూ ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి అయింది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి టాకీపార్టు పోస్టు ప్రొడక్షన్ వరకు కూడా ఏమాత్రం బ్రేకులు లేకుండా జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ ఫుల్ కాంబినేషన్లో రాబోతున్న సలార్ చిత్రం నుంచి అప్డేట్లు మాత్రం పెద్దగా రావడం లేదు. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా నిరాశతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమా టీజర్ రాబోతోందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత అయితే రాలేదు.. ఈ నేపథ్యంలోనే తాజాగా సలార్ టీజర్ డేట్ ని లాక్ చేసినట్లు ఒక క్రేజీ రూమర్ వైరల్ గా మారుతోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదల చేయబోతున్నారు ఇక ఈ చిత్రం టీజర్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయాలని ఆలోచనలతో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.. ప్రభాస్ సలార్ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలలో నటించబోతున్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై అధికారికంగా చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: