శ్రీలీల ఎంట్రీ తో సైలెంట్ ఐనా స్టార్ హీరోయిన్స్ వీళ్ళే....!!!
ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీ లీల. చేసిన రెండు సినిమాలకే ఇప్పుడు స్టార్ హీరోలు ఈ అమ్మడిపై మనసు పారేసుకున్నారు. కారణం ఈ ముద్దుగుమ్మలో యాక్టింగ్ స్కిల్స్ తో పాటు, అందం, టాలెంట్ కూడా ఉంది. దీంతో ఇప్పుడున్న స్టార్ హీరోలంతా మొదట ఈ ముద్దుగుమ్మనే ఎంచుకుంటున్నారు. కేవలం చిన్న హీరో అయిన రోషన్ తో పెళ్లి సందD సినిమాలో చేయగా ఆ తర్వాత.. స్టార్ హీరో రవితేజతో ధమాకాలో నటించింది. ఈ సినిమా ఈ అమ్మడి తలరాత మొత్తం మార్చేసింది. దీంతో ఇప్పుడు దర్శకులంతా ఈ ముద్దుగుమ్మ కోసం క్యూ కట్టారు. ప్రస్తుతం శ్రీ లీల బాలయ్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ ఇంక మరి కొంతమంది స్టార్ హీరోలతో కలిపి దాదాపై పది కి పైగా సినిమాలు చేస్తుంది. అయితే ఈ సినిమాలు దగ్గర పడుతున్న సందర్భంగా.. మరింత బిజీ అవ్వటానికి సెకండ్ హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగులల్లో కూడా చేయడానికి సిద్ధమైందని తెలిసింది. ఇప్పుడు ఏ దర్శకుడైన, హీరో అయిన శ్రీ లీలనే పట్టుకోవడంతో తమన్నా, సమంతలకు కుళ్ళు లేస్తుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా వీరిద్దరి చేతిలో కూడా అన్ని సినిమాలు లేకపోవడంతో.. వీరి టైం దగ్గర పడింది అని.. త్వరలో హీరోయిన్ గా వీరిద్దరూ ముగింపు పలకటం ఖాయమని.. ఇప్పుడు శ్రీ లీల క్రేజ్ నడుస్తుంది అని.. అందుకే వీరిద్దరూ ఇప్పుడు సైలెంట్ గా కనిపిస్తున్నారు అని అంటున్నారు.