హనుమంతుడి డైలాగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మనోజ్....!!
ఈ సినిమా లో మాస్ డైలాగ్స్ వెనుక అసలు కథ ఇదేనని ఆయన పేర్కొన్నారు. నిశితంగా ఆలోచించి హనుమాన్ డైలాగ్స్ రాశానని మనోజ్ వెల్లడించారు. అందరూ ఒకేలా మాట్లాడరని పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడానికి డైలాగ్స్ అలా రాశామని మనోజ్ పేర్కొన్నారు. ఈ తరహా డైలాగ్స్ రాసిన మొదటి వ్యకిని నేను కాదని జానపద కళాకారులు రామాయణం డైలాగ్స్ ను ఇదే విధంగా చెప్పేవారని ఆయన చెప్పుకొచ్చారు.
మనోజ్ సమర్థించుకున్న తీరుపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయి లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆదిపురుష్ సినిమా పై ట్రోలింగ్ కొనసాగుస్తోంది. కమర్షియల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి. ఈ సినిమాకు 140 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆదిపురుష్ నెగిటివ్ కామెంట్ల పై రియాక్ట్ కావడానికి ఎవరూ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.