టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ఆఖరుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గ నటించగా ... రమ్యకృష్ణ ... మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఇలా లైగర్ మూవీ తో భారీ డిజాస్టర్ ను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం ఖుషి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా ... శివ నర్వన ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక పాటను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత విజయ్ ... పరుశురామ్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది.
దానితో ఈ మూవీ టైటిల్ పై ఈ మూవీ ఈ బృందం కసరస్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ మూవీ కి ఫ్యామిలీ స్టార్ ... కుటుంబరావు అనే రెండు టైటిల్ లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టైటిల్ లలో ఏదో ఒక దానిని ఈ సినిమాకు ఫిక్స్ చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.