చాలా మంది ముద్దుగుమ్మలు తెలుగులో అలరించి హీరోయిన్స్ గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి భామల్లో తాప్సీ ఒకరు.మంచు మనోజ్ నటించిన ఝుమంది నాదం తో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ. తొలి తోనే తన నటనతో.. గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజతో వరుసగా రెండు ల్లో నటించింది. ప్రభాస్ తో చేసిన మిస్టర్ ఫర్ఫెక్ట్ తో మంచి హిట్ అందుకుంది. తెలుగులో అవకాశాలు అనుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాగానే సక్సెస్ అయ్యింది. హిందీలో తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ లతో మెప్పించింది.అలాగే స్టార్ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ తో మాటల యుద్ధం కూడా చేసింది. అలా బాలీవుడ్ లో తాప్సీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో వరుసగా లు చేస్తున్నప్పటికీ అడపాదడపా సౌత్ లో లు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
తాజాగా తాప్సీ బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పటికే ప్రియాంక చోప్రా బాలీవుడ్ పై పలు ఆరోపణలు చేసింది ఈ ఆరోపణల పై స్పందిస్తూ తాప్సీ కూడా బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది . ఒక లో ఏ ఏ పాత్రలకు ఎవరిని తీసుకోవాలో కొంతమంది నటీనటుడు డిసైడ్ చేస్తారని అంటుంది ఈ భామ.టాలెంట్ ఉన్నవాళ్ళు, క్యారెక్టర్ కు సూట్ అయ్యేవాళ్ళను కాకుండా.. తమ స్నేహితులను,ఏజెన్సీ వాళ్ళను సిఫార్స్ చేస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చింది. హిందీలో క్యాంపులు, ఫేవరిటిజం ఉంటాయని తెలిసిందే..బాలీవుడ్ లో పక్షపాత ధోరణి ఉంటుంది అని తెలిపింది తాప్సీ.