ఇక ఆది పురుష్ సినిమా కథ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది రామాయణం కాబట్టి అందరికి తెలిసిన కథే. అయితే ఈ సినిమాకి సంబంధించి కొత్త విషయాలు ఏమున్నాయో తెలుసుకుందాం.ఈ జనరేషన్ కోసం ఎంతో మోడ్రనైజ్ చేసి ఈ సినిమాని తీసినట్టుంది దర్శకుడు ఓం. అందుకోసం ఆయన టిక్ లీనియన్స్ చాలా తీసుకున్నాడు. వందల ఏళ్లుగా రామాయణం ఉంటే ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిన మనకు కాదు ఇంకోలా ఉంటుంది అని చూపిస్తే ఎలా ఉంటుంది..? ఇప్పుడు ఈ ఆదిపురుష్ కూడా అచ్చంగా అలాంటిదే. ఇది రామాయణమే.. అయితే పూర్తిగా మోడ్రన్ రామాయణం అని చెప్పాలి. మూవీలో క్యారెక్టర్స్ మాత్రం అవే ఉంటాయి కానీ.. వాటి అప్పియరెన్స్ అయితే అసలు ఎవ్వరు ఊహించని విధంగా ఉంటాయి. ఈ జనరేషన్ కు తగ్గట్టు రామాయణాన్ని హై రేంజ్ టెక్నాలజీతో చెప్పాలని గొప్ప ప్రయత్నం చేశాడు ఓం రౌత్.
కానీ తర తరాలుగా ఎన్నో కోట్ల మంది ఆరాధించే ఒక ఇతిహాసాన్ని కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేసినప్పుడు విమర్శలు కూడా కామన్. ఈ విషయంలో ఆదిపురుష్ చాలా విమర్శలు అందుకుంది. ఇంకా ఎన్నో అందుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మనం ఇప్పటిదాకా చూసిన రామాయణ చిత్రాలకు ఇంకా ఊహించిన పాత్రలకు పూర్తి భిన్నం ఈ సినిమా. అయితే ఒక్కటి చెప్పవచ్చు. ఈ సినిమాని ప్రస్తుత జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా గ్రాఫిక్స్ రూపొందించి హాలీవుడ్ రేంజ్ లో ప్రాజెక్ట్ చేశాడు ఓం.నిజానికి ఆ గట్స్ కి ఓంకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీలా ఈ రామాయణం ఉంది. ఈ జనరేషన్ పిల్లలకు ఈ రామాయణం చాలా బాగా నచ్చుతుంది.ఆదిపురుష్ మూవీకి సంగీతం ప్రాణం. ప్రతి పాట కూడా అలరిస్తుంది.ఇంకా అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ మూవీకి ప్రధానమైన వెన్నుముక అదే. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంది.