'ఆదిపురుష్ ' మూవీ లో సీత పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్....!!
అయితే ఈ పాత్ర కి మొట్టమొదటి ఛాయస్ కృతి సనన్ కాదట, డైరెక్టర్ ఓం రౌత్ దీపికా పదుకొనే డేట్స్ కోసం చాలా రోజులు ఎదురు చూసాడు.ఆమెకి నటించాలని కోరిక ఉన్నప్పటికీ కూడా, డేట్స్ సర్దుబాటు చెయ్యలేక నటించలేకపోయింది.సీత పాత్ర కి ఎలాంటి హీరోయిన్స్ సూట్ అవుతారు అనే లిస్ట్ తీస్తే అందులో దీపికా పదుకొనే ఉండడం సహజం, ఆమె ముఖ వచ్చస్సు అలాంటిది.పద్మావత్ అనే సినిమాలో ఆమె ఎంత అద్భుతంగా నటించిందో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోలేదు.ఈ సినిమా తర్వాత ఇలాంటి పాత్రలకు ఎవరైనా దీపికా పదుకొనే ని ఎంచుకుంటారు, కానీ బ్యాడ్ లక్ ఆమె డేట్స్ దొరకక పోవడం తో కృతి సనన్ ని తీసుకున్నారు.ముందుగా టెస్ట్ షూట్ చేసారు, ప్రభాస్ కి సైతం ఆమె ఎక్స్ ప్రెషన్స్ మరియు లుక్స్ ని చూసి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యిందని అయిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఈ చిత్రం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లిస్ట్ తీస్తే అందులో కృతి సనన్ పేరు లేకుండా ఉండదు.అంత అద్భుతంగా చేసింది ఆమె.దీపికా పదుకొనే ప్రభాస్ తో ఈ సినిమా మిస్ అయ్యినప్పటికీ, మహానటి నటి ఫేమ్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ K చిత్రం లో మాత్రం నటిస్తుంది.వీళ్ళ జోడి ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.ఇక ప్రభాస్ ఆదిపురుష్ మొదటి రోజు వసూళ్ల విషయానికి వస్తే, ఈ చిత్రం కచ్చితంగా అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.బాహుబలి సిరీస్ మరియు ఆదిపురుష్ చిత్రాలతో మొదటి రోజే వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.