ఫుల్ స్పీడ్ లో "దేవర" మూవీ షూటింగ్... అప్పటికే టాకీ మొత్తం పూర్తి..!

frame ఫుల్ స్పీడ్ లో "దేవర" మూవీ షూటింగ్... అప్పటికే టాకీ మొత్తం పూర్తి..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లలో హీరోగా నటించి తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. చివరిగా ఈ నటుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో హీరోగా నటించి గ్లోబల్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మిర్చి , శ్రీ మంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను , ఆచార్య లాంటి సినిమా లకు దర్శకత్వం వహించినటు వంటి కొరటాల శివ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ ను ఈ చిత్ర బృందం కొంత కాలం క్రితమే ప్రారంభించింది. కాకపోతే ఈ మూవీ షూటింగ్ ను మాత్రం ఈ మూవీ బృందం ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తుంది. దానితో ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా బాగం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ ఈ నెల 20 వ తేదీ వరకు కొనసాగనట్లు తెలుస్తోంది. దీనితో ఈ షెడ్యూల్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన టాకీ భాగం మొత్తాన్ని నవంబర్ చివరి వరకు పూర్తి చేయనున్నట్లు ... ఆ తర్వాత ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని పాన్  ఇండియా స్థాయి కంటే కూడా భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: