థియేటర్లో ఆంజనేయస్వామి సీట్ గూర్చి సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్జీవి....!!

murali krishna
సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఏదైనా విషయం గురించి స్పందిస్తే వివాదాస్పదం అవుతుందనే సంగతి తెలిసిందే. వివాదాస్పద అంశాల గురించి అయితే వర్మ చేసే కామెంట్లు మరింత విచిత్రంగా ఉంటాయి.ఆదిపురుష్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల లో ఒక సీటును ఆంజనేయస్వామి కోసం రిజర్వ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డిమాండ్ విషయం లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వర్మ ఆంజనేయస్వామి కి సీటు అంటే దేవుడిని అవమానించినట్టే అని వెల్లడించారు. మన దేశం లోనే ప్రభాస్ సూపర్ స్టార్ అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ప్రభాస్ సినిమాలకు మంచి క్రేజ్ ఉందని వర్మ చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ మూవీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం తో సాధారణ సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా కు క్రేజ్ మరింత ఎక్కువగా ఉందని వర్మ పేర్కొన్నారు.

ఆదిపురుష్ సినిమా కు ఫ్రీ టికెట్లను ఇవ్వడం ద్వారా తమకు కూడా పాపులారిటీ లభిస్తుందని సెలబ్రిటీలు భావిస్తున్నారని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామికి టికెట్ ను రిజర్వ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం దేవుడిని అవమానించినట్టే అవుతుందని ఆర్జీవీ వెల్లడించారు. హనుమంతునికి థియేటర్ ను సంజీవిని పర్వతంలా ఎత్తుకెళ్లే సత్తా ఉందని ఆర్జీవీ అన్నారు.

ఆంజనేయుడికి సీటును కేటాయించాల్సిన అవసరం అయితే లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కొంతమంది వర్మ కామెంట్ల గురించి పాజిటివ్ గా రియాక్ట్ అవుతుండగా మరి కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వ్యూహం సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. జగన్ బయోపిక్ గా వ్యూహం, వ్యూహం2 సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: