బాహుబలి పై తమన్నా షాకింగ్ కామెంట్స్....!!

murali krishna
తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది.ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గురించి చెప్పుకోవాలంటే బాహుబలి అనే చెప్పాలి.
అందం విషయంలో తమన్నా ఎప్పటికీ ప్రత్యేక స్థానంలో ఉంటుంది. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లలో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు.
తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. ఆ తర్వాత తమన్నా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.
ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గురించి చెప్పుకోవాలంటే బాహుబలి అనే చెప్పాలి. అవంతిక పాత్రలో యోధురాలిగా కనిపిస్తూనే.. ఎంతో అందంగా మైమరపించింది. అయితే తమన్నాకి బాహుబలిపై విభిన్నమైన అభిప్రాయం ఉంది. తాజాగా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తనకు బాహుబలి చిత్రం వల్ల ఒరిగింది ఏమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
బాహుబలి చిత్రంలో నా పాత్ర అతిథి పాత్రగానే ఉండిపోయింది. సరైన గుర్తింపు లభించలేదు. ఇలాంటి చిత్రాలకు హీరోలకే ఎక్కువ గుర్తింపు ఉంటుందనేది నా అభిప్రాయం. ప్రభాస్, రానా లకి ఈ చిత్రంతో గ్లోబల్ గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత రమ్యకృష్ణ, అనుష్క లకి కూడా మంచి గుర్తింపు దక్కింది. కానీ నా పాత్రకి అంతగా ఆదరణ దక్కలేదు అని తమన్నా నిరాశ వ్యక్తం చేసింది. కనై అభిమానులకు మాత్రం పార్ట్ 1లో తన పాత్ర నచ్చింది అని పేర్కొంది.
బాహుబలి రిలీజై ఇన్నేళ్లవుతుంటే తమన్నా ఇప్పుడు ఈ కామెంట్స్ ఎందుకు చేసిందో మరి. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్.. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: