విరూపాక్ష-2 అంతకుమించి అనేలా క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

frame విరూపాక్ష-2 అంతకుమించి అనేలా క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

Divya
డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ తో వచ్చిన సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో మంచి విజయాలను అందుకుంటున్నాయి.. రీసెంట్ గా సాయి ధరంతేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో కార్తీక్ దండు డైరెక్షన్లో సినిమా విడుదలై రూ .100 కోట్ల మార్కును అందుకుంది. అయితే సాయి ధరంతేజ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని చెప్పవచ్చు.. కార్తీక్ దండు సినిమా నడిపిన కథ విధానం ఆడియోస్స్ నీ చాలా ఎక్సైటింగ్ అయ్యేలా చేసింది. ముఖ్యంగా ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ నేపథ్యంలో తెరకెక్కించడంతో ఈ సినిమా ఇష్టపడే అభిమానుల సంఖ్య పెరిగిపోయింది.


విరూపాక్ష సినిమాకి సుకుమార్ ఇచ్చిన సలహాలు ఈ సినిమాకు బాగానే హెల్ప్ చేశాయని చెప్పవచ్చు. హీరోయిన్ గా సంయుక్త అద్భుతమైన నటనతో ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారింది. విరూపాక్ష సినిమా సీక్వెల్  గురించి డైరెక్టర్ చివరిలో హింట్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సెకండ్ పార్ట్ లో సాయి ధరంతేజ్ నెగటివ్ రోల్ నటించబోతున్నారని సమాచారం. రీసెంట్ గా కార్తీక్ దండు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విరూపాక్ష-2 కథ ఇంకా డెవలప్మెంట్ స్టేజిలోనే ఉందంటూ తెలియజేయడం జరిగింది. ఈ సినిమా సీక్వెల్ కి కూడా సుకుమార్ తన సపోర్టు అందిస్తానని తెలిపారట.


దీంతో విరూపాక్ష-2 ఉంటుందనే విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి కాస్త సమయం పడుతుందని తెలియజేశారు. ఇదే కాదు తన దగ్గర చాలా భయపెట్టే కథలు ఉన్నాయని కచ్చితంగా ఒక లవ్ స్టోరీ కూడా తీస్తానని కానీ దానిలో కూడా భయపెట్టే అంశాలు ఉంటాయని కార్తీక్ దండు తెలియజేయడం జరిగింది.. మరి లవ్ స్టోరీస్ లో త్రిల్లర్ అంశాలు ఏంటో వి వీలు మాత్రం చేయలేదు ఏది ఏమైనా తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా అలరించిన కార్తీక్ దండు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు విరూపాక్ష చిత్రంతో తన టాలెంట్ ను చూపించి మంచి విజయాన్ని అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: