రెబల్ స్టార్
ప్రభాస్ హీరోగా
కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన
ఆది పురుష్ అనే భారీ బడ్జెట్
ఇండియా సినిమా జూన్ 16 వ తేదీన తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
సినిమా బృందం ఈ
మూవీ కి సంబంధించిన అన్ని ప్రాంతాల
థియేటర్ హక్కులను అమ్మి వేసింది. ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ కి నైజాం ఏరియాలో 50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 17.60 కోట్లు , యుఎ లో 14.50 కోట్లు , ఈస్ట్ లో 8.80 కోట్లు , వెస్ట్ లో 7.20 కోట్లు , గుంటూరు లో 8.60 కోట్లు ,
కృష్ణ లో 8.50 కోట్లు , నెల్లూరు లో 4.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఈ
మూవీ కి కర్ణాటక లో 16.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ...
తమిళ నాడు లో 5 కోట్లు ,
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 కోట్లు ,
కేరళ లో 2 కోట్లు , ఓవర్ సీస్ లో 21.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ
సినిమా కనుక ప్రపంచ వ్యాప్తంగా 242 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే
బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హీట్ గా నిలుస్తుంది.