'' లవ్ యు మై బండ ఫెలో...." అంటూ ఎమోషనల్ ఐనా సాయి ధరమ్ తేజ్....!!

murali krishna
సాధారణంగా సినిమా సెలబ్రెటీలు పెట్ డాగ్స్ పెంచుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలందరూ కూడా పెట్ డాగ్స్ పెంచుకుంటూ వాటిని కూడా తమ కుటుంబ సభ్యులకు భావిస్తూ ఉంటారు.అయితే అందరి మాదిరిగానే హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ కుక్కను ఎంతో ఇష్టంగా పెంచుకున్నారు.దానికి టాంగో  అని పేరు కూడా పెట్టారు.ఇలా తనకు ఎంతో ఇష్టమైన ఆ కుక్కతో తనకు ఎంతో మంచి అనుబంధంగా ఉందని తెలుస్తుంది. అయితే తాజాగా తన పెట్ డాగ్ టాంగో మరణించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తన గురించి తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా టాంగో మొదటిరోజు తీసుకున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ లెటర్స్ రాసుకు వచ్చారు. ఇందులో తన టాంగో గురించి రాసుకోస్తూ నిన్ను తలుచుకున్న ప్రతిసారి నా మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. నువ్వు లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది.నువ్వు నన్ను రక్షించావు కష్టాల్లో నాతో ఆడుకున్నావు, నాకు సంతోషాన్ని కలిగించావు. ఇలా నాకు ఎంతో ప్రేమను కలిగించిన నిన్ను పొందడం నా అదృష్టం. నువ్వు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఓ మూమెంట్ లాగా గుర్తుంది. లవ్ యు మై బండ ఫెలో..మిస్ యూ టాంగో.. అంటూ రాశాడు. ఇలా సాయిధరమ్ తేజ్ తన పెట్ డాగ్ గురించి తనపై ఉన్నటువంటి ప్రేమ గురించి తెలియజేస్తూ ఈ సందర్భంగా రాసినటువంటి ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈయన షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సైతం ఎంతో బాధను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఇక సాయిధరమ్ తేజ్ సినిమాల విషయానికొస్తే విరూపాక్ష  సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఎంతో అద్భుతమైన సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు అనంతరం పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా జులై 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: