ఒకేరోజు తేడాతో రెండు భారీ సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్న తమన్నా..!

Pulgam Srinivas
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. తమన్నా కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా అనేక తమిళ సినిమాలలో కూడా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా తమన్నా తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా లలో అవకాశాలను దక్కించుకుంటుంది.


అందులో భాగంగా ప్రస్తుతం ఈనటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో పొందుతున్న భోళా శేఖర్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... సుశాంత్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తమన్నా ఈ మూవీ తో పాటు సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే మూవీ లో కూడా కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.


ఈ మూవీ ని ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇలా తమన్నా నటించిన రెండు మూవీ లు ఒక రోజు తేడాతో థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కానుక బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించినట్లు అయితే ఒకే సారి ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రెండు మూవీ లు ఏ రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాయో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: