జీవితంలో వాటి జోలికి పొనని ప్రమాణం చేసిన కమెడియన్ ....!!

murali krishna
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ల లో ఒకరైన సప్తగిరి నటించిన సినిమాల లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. కొన్ని సినిమాలలో కమెడియన్ రోల్ లో నటించిన సప్తగిరి కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించి సక్సెస్ సాధించారు.సప్తగిరి కీలక పాత్రలో నటించిన అన్ స్టాపబుల్ మూవీ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సప్తగిరి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

చిత్తూరు స్లాంగ్ లో అద్భుతంగా మాట్లాడే ఈ కమెడియన్ 250 రూపాయల తో సినిమా లలో ఏదో ఒకటి సాధించాలని కెరీర్ ను మొదలుపెట్టానని బొమ్మరిల్లు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని అన్నారు. హీరోగా కూడా విజయాలు దక్కాయని సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇవన్నీ సాధించుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. మా నాన్న ఫారెస్ట్ డిపార్టుమెంట్ లో పని చేశారని సప్తగిరి పేర్కొన్నారు.

సప్తగిరి ఎల్.ఎల్.బీ కూడా నాకు మంచి పేరు తెచ్చిందని సప్తగిరి తెలిపారు. హీరో అయ్యాక చిన్నచిన్న వేషాలు ఇస్తే చేయనేమో అని చాలామంది పిలవలేదని ఆయన కామెంట్లు చేశారు. ఆ సమయం లో కొంత ఇబ్బంది పడటం నిజమేనని సప్తగిరి కామెంట్లు చేశారు. సప్తగిరి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదిక గా వైరల్ అవుతున్నాయి. దిగువ మధ్య తరగతి జీవితాన్ని తాను అనుభవించానని ఆయన కామెంట్లు చేశారు.

సప్తగిరి చెప్పిన విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. సప్తగిరి కెరీర్ పరంగా మరింత ఎదగాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సప్తగిరి రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయి లోనే ఉందని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వెంకటేశ్వర స్వామి గర్భ గుడి లో ఈ కట్టె కాలేవరకు నాన్ వెజ్ ముట్టనని ప్రమాణం చేశానని ఆయన తెలిపారు. సప్తగిరికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: