న్యూ టీజర్ లో తండ్రిని గుర్తుచేసిన బాలయ్య...!!
నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమా 'భగవంత్ కేసరి' నుండి ఒక చిన్న టీజర్ ని విడుదల చేశారు. బాలకృష్ణ ఎన్ని ఫ్యాక్షన్ సినిమాలు చేసినా, అటువంటి పాత్రల్లో ఎన్ని చూసినా, ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ 'భగవంత్ కేసరి' టీజర్ లో కూడా బాలయ్య కొత్తగా కనిపిస్తూ, కొత్త డైలాగ్స్ చెపుతూ అదరగొట్టాడు. ఈసారి హిందీలో ఒక డైలాగ్ పెట్టి అనిల్ రావిపూడి బాలకృష్ణని వైవిధ్యంగా చూపించాడు ఈ టీజర్ లో‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి’ అని బాలయ్య విలన్స్‌కి తాను ఎవరో ఏంటో చెప్పే సన్నివేశం చాలా పవర్‌ఫుల్‌గా తీసాడు అనిల్ రావిపూడి. ‘ఈ పేరు చానా యేళ్లు యాదుంటది’ అని బాలయ్య తెలంగాణ భాషలో చెప్పిన డైలాగ్ కూడా అదిరింది. అయితే ఈ టీజర్ ఒక చిన్న రెట్రో మ్యూజిక్‌తో ఎండ్ అవుతుంది. ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఎక్కడో విన్నట్టు అనిపించటం లేదూ?
అవును అది బాలకృష్ణ తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు నటించిన 'భలే తమ్ముడు' సినిమాలోది అని తెలుస్తోంది. అందులో పాటలు అన్నీ హిందీ పాటలు పాడే గాయకుడూ మొహమ్మద్ రఫీ చేత పాడించారు అప్పట్లో ఎన్టీఆర్ గొంతు అనుకరణ సరిగ్గా లేకపోయినా, రఫీ చేత పాటలు పాడించాలి అని పాడించుకున్నారు ఎన్టీఆర్.