తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న కొంత మంది హీరోల సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అలా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల అయిన అల్లు అర్జున్ , రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ సినిమాల షూటింగ్ లు ఏ దశలో ఉన్నాయో తెలుసుకుందాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. ఈ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తుంది.
రవితేజ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ... రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. కాకపోతే ఈ మూవీ కి ఈగల్ అనే టైటిల్ ను ఈ మూవీ బృందం ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలవడబోతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ మూవీ యూనిట్ రవితేజ పై ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాలోని చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.