సాయి తేజ్ కెరియర్లో ఆఖరి 5 మూవీల కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ తన కెరియర్ లో నటించిన ఆఖరి 5 మూవీ ల క్లోసింగ్ కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

విరూపాక్ష : తాజాగా సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా ... కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 48.20 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. సాయి తేజ్ కెరీర్ లో సినిమా అత్యధిక కలక్షన్ లను వసూలు చేసిన మూవీ ల లిస్టు లో టాప్స్ ప్లేస్ లో నిలిచింది.

రిపబ్లిక్ : సాయి తేజ్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 6.86 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

సోలో బ్రతుకే సో బెటర్ : సాయి తేజ్ హీరో గా నటించిన ఈ మూవీ లో బ్యూటిఫుల్ నటి నబా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 12.61 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

ప్రతి రోజు పండగే : సాయి తేజ్ హీ రోగా నటించిన ఈ మూవీ లో రాసి కన్నా హీరోయిన్ గా నటించగా ... మారుతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ మొత్తం గా ప్రపంచ వ్యాప్తంగా 34.06 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

చిత్రలహరి : సాయి తేజ్ హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 16.74 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: