ఆ కారణంగా ఇంకా పెళ్లి చేసుకొని శ్రీముఖి.....!!

murali krishna
తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పనిచేయం అక్కర్లేదు. శ్రీముఖికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే.ఇటీవల కాలంలో ఏ ఈవెంట్లో ఏ కార్యక్రమంలో చూసినా కూడా శ్రీముఖి పేరు వినిపిస్తోంది. శ్రీముఖి ఏ షో కి హోస్టుగా చేసినా కూడా నా యాంకరింగ్ తో ప్రేక్షకులకు కావాల్సిన అంత ఎంటర్టైన్మెంట్ నువ్వు అందిస్తుంది అని చెప్పవచ్చు. మొదట అదుర్స్ షోతో యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన శ్రీముఖి పటాస్, సూపర్ సింగర్స్, సింగింగ్ షో, బొమ్మ అదిరింది, కామెడీ స్టార్స్, ఆదివారం స్టార్ మా పరివారం, డాన్స్ ఐకాన్, మిస్టర్ అండ్ మిసెస్, సారంగదరియా, ఇలా ఎన్నో రకాల షోలకి యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.
అంతేకాకుండా జులాయి సినిమాతో నటిగా కెరీర్ ను ప్రారంభించిన శ్రీముఖి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్,నేను శైలజ, సావిత్రి, జెంటిల్మ్యాన్, మనలో ఒకడు,బాబు బాగా బిజీ, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, క్రేజీ అంకుల్స్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. ఒకవైపు కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తరచూ బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోస్ చేస్తూ తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంటోంది. కాగా నాలుగు పదుల వయసుకి చేరువ అవుతున్న ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది శ్రీముఖి.
ఏజ్ ముదురుతున్నా కూడా ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు. ఇలా ఉంటే తాజాగా శ్రీముఖి స్టార్ మా పరివారం షోలో పెళ్లికి సంబంధించి ఆసక్తికర వార్తను తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఆదివారం ప్రసారమయ్యే ఈ షోలో ప్రోమోలో.మొగుడ్స్ వర్సెస్ పెళ్లామ్స్ అనే షోలో టీవీ ఆర్టిస్టులు అర్జున్, చెర్రీ, హరి, రిషి, యాష్, పార్థు, వారి భార్యలు పాల్గొన్నారు. భార్య భర్తల మధ్య పోటీ, ఎవరు గొప్ప అనే పోటీలు నిర్వహించారు. ఆద్యంతం నవ్వులు పూయించేలా ఈ షో సాగింది. ఈ క్రమంలోనే తన పెళ్లి మ్యాటర్ గురించి ఓపెన్ అయ్యింది శ్రీముఖి.
పక్కనే ఉన్న ఫైమాతో రహస్యాన్ని బయటపెట్టింది. గెస్ట్ లుగా వచ్చిన వారంతా భార్యలతో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూసిన శ్రీముఖి నేను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా, పెళ్లైతే ఇన్ని ఉంటాయని చేసుకోవడం లేదు అర్థమైందా నీకు అంటూ ఫైమాతో చెప్పింది శ్రీముఖి. దీంతో వెంటనే ఫైమా అందుకుంది. అందరి ముందు శ్రీముఖి గాలి తీసింది. నేనింకా నీకు ఎవరు రావడం లేదేమో అనుకుంటున్నా అంటూ ముఖం మీదే చెప్పేసింది. దీంతో శ్రీముఖి ముఖం మాడిపోయింది. షోలో ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: