బాలయ్య బాబు పేరు మీద ఉన్న రికార్డ్.....!!

murali krishna
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ రోజు తన పుట్టిన రోజును జరుపు కుంటున్నారు.. ఈ సందర్భం గా ఈయనకు నిన్నటి నుండే ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.సోషల్ మీడియాలో ప్రముఖులు, ఫ్యాన్స్ విశేష్ తో సందడి మాములుగా లేదు. ఇదిలా ఉండగా ఈయన తన జనరేషన్ లో ఒక రికార్డ్ నెలకొల్పాడు. ఆ రికార్డ్ మరే ఇతర హీరో లకు సాధ్యం కాలేదు..అలాంటి రికార్డ్ మరో హీరో నెలకొల్పతాడు అనే గ్యారెంటీ కూడా లేదు.. ఆ జనరేషన్ మాత్రమే కాదు.. ఇప్పటి జనరేషన్ కు కూడా సాధ్యం కానీ రికార్డ్ నెలకొల్పాడు.. ఇంతకీ ఆ హీరో నెలకొల్పిన రికార్డ్ ఏంటి.. అనే వివరాల్లో కి వెళ్తే.. బాలయ్య తన కెరీర్ లో డ్యూయెల్ రోల్ లో చాలా సినిమా ల్లో నటించాడు. ఏకంగా 18 సినిమా ల్లో డ్యూయెల్ రోల్ లో నటించాడు.
ఇలా ఇన్ని డ్యూయెల్ రోల్స్ చేసి బాలయ్య అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసాడు.. ఈయన ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు చాలా వరకు బాగానే హిట్ అయ్యాయి.. ఈ మధ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో నటించాడు.. మరి ఇప్పటి హీరోలు ఇలాంటి రికార్డ్ నెలకొల్పడం అంటే అసాధ్యం అనే చెప్పాలి.. బాలయ్య కవల సోదరుడి గా, తండ్రి తనయుడిగా, తాత మనవళ్లుగా, బావ బామ్మర్దులుగా, రాజుగా, సామాన్యుడి గా, భగవంతుడి గా, భక్తుడి గా పాత్రల్లో డ్యూయెల్ రోల్లో నటించి మెప్పించాడు.. మొత్తాని కి ఎవ్వరికి సాధ్యం కానీ రికార్డ్ అయితే ఈయన పేరు మీద ఉంది.. ఇదిలా ఉండగా ప్రజెంట్ నందమూరి బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా నుండి బర్త్ డే కానుక గా టీజర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: