ప్రభు దేవా చూపించిన స్టెప్స్ వేయలేక ఇబ్బంది పడ్డా : రాజశేఖర్
యాంగ్రీ యంగ్‌మెన్'గా తెలుగు చిత్ర పరిశ్రమ లో తనకంటూ ప్రత్యేక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రాజశేఖర్ ను ఒక విషయం లో డ్యాన్స్ మాస్టార్ ప్రభుదేవ వల్ల విపరీతం గా ఇబ్బంది పడ్డాడని తెలుస్తుంది.
ఆయన నటించిన 'అల్లరిప్రియుడు' మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా అయితే చెప్పనవసరం లేదు.. అయితే, అందులోని పాటలకు డ్యాన్స్ చేయడానికి రాజశేఖర్ బాగా ఇబ్బంది పడేవారట. ప్రభుదేవా గురించి ఆయన చెబుతూ ''ప్రభుదేవా చేసి చూపించిన స్టెప్లు అస్సలు వేయలేకపోయేవాడిని. దీంతో నా బాడీకి సరిపోయేలా స్టెప్లను ప్రభుదేవా చేసి మరీ చూపించేవారు. కొన్ని సార్లు అవికూడా చేయలేకపోయేవాడిని. అయినా, ప్రభుదేవా ఎప్పుడూ నాపై అసహనం వ్యక్తం చేయలేదు. తన సహాయకులకు అలాగే సైడ్ డ్యాన్సర్లకు ఒక సలహా ను ఇచ్చారు. రాజశేఖర్ గారు ఏది చేస్తే దాన్ని ఫాలో అవ్వండి' అని ఆయన చెప్పారు.. నన్ను 'డాక్టర్ మైకేల్ జాక్సన్' అని సరదాగా పిలిచేవారు'' అంటూ సరదాగా చెప్పాడు రాజశేఖర్. అప్పట్లో 'అంకుశం' వంటి చిత్రాలతో మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు రాజశేఖర్ 'అల్లరి ప్రియుడు'లో ప్రేమికుడిగా కూడా నటించి, తాను ఏ పాత్రలోనైనా నటించగలను అని నిరూపించారు.రాఘవేంద్రరావు ఈ కథ చెప్పగానే రాజశేఖర్‌తో సహా చాలా మంది 'ఎందుకు సర్ రిస్క్' అన్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.. అయినా, దర్శకేంద్రుడు అస్సలు వదల్లేదు.. రాజశేఖర్ తోనే సినిమా తీసి హిట్ కొట్టారు.