ఆ హీరో ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా.. శ్రీముఖి...!!

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట పటాస్ షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించింది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలను కూడా అందుకొని బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగిస్తోంది. ప్రస్తుత శ్రీముఖి చేస్తున్న షోలు మరెవరు చేయట్లేదని చెప్పవచ్చు. ఆమె చేతిలో నాలుగు ఐదు షోలు కూడా ప్రస్తుతం ఉన్నాయి.. ప్రస్తుతం స్టార్ మా, ఈటీవీ ,జీ న్యూస్ వంటి ఇతర చానల్స్ లో కూడా పలు షో లు చేస్తూ బిజీగానే ఉంటోంది.

అయితే ఈమెకు మూడు పదుల వయసు దాటినా సరే ఇంకా వివాహం చేసుకోకుండా సింగల్ గా ఉండడంతో అభిమానులు శ్రీముఖి పెళ్లి ఎప్పుడు అంటూ ఎలాంటి ప్రోగ్రాం లో కనిపించిన సరే అడుగుతూ ఉంటారు. ఇదే సమయంలో ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చిన చేసేందుకు సిద్ధంగా ఉంటుంది తప్ప వివాహం చేసుకునేందుకు సిద్ధంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా బుల్లితెర ఆర్టిస్టులు తమ భార్యలతో కలిసి ఒక షోలోకి రావడం జరిగింది. ఇందులో వారు తమ భార్యలతో కాస్త గొడవ పడుతూ ఫన్నీగా ఆటలు ఆడారు.
అయితే ఓ సమయంలో నీకు పెళ్లి వద్ద అని ఫైమా అడిగింది.. ఈ విషయంపై శ్రీముఖి మాట్లాడుతూ నా అందానికి ఏ హీరో సెట్ అవుతాడని అడుగుతుంది ప్రభాస్ ఒక్కడే సింగిల్ గా ఉన్నాడని ఫైమ చెప్పడంతో.. ఆయన ఒప్పుకుంటే ఎగిరి గంతేసి చేసుకుంటానంటూ తెలియజేసింది శ్రీముఖి.ఎక్కడ కలలో అంటూ పైమ పంచువేసింది. ఇలా అధ్యంతం వారి షోలు నవ్వులు పూజించింది శ్రీముఖి. ఎట్టకేలకు ప్రభాస్ను వివాహం చేసుకోవాలని విషయాన్ని మాత్రం బయటపెట్టింది శ్రీముఖి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ప్రోమో మాత్రం వైరల్ గా మారుతోంది. శ్రీముఖి మీద గతంలో కూడా పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: