ఆ తేదీన "రష్యా" లో విడుదల కానున్న షారుక్ ఖాన్ బ్లాక్ బాస్టర్ మూవీ..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కథ కొంత కాలంగా వరస అపజయాలు ఎదురు కావడంతో కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన షారుక్ తాజాగా పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకులం ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో షారుక్ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన ఈ సినిమాను ఈ మూవీ యూనిట్ రష్యా లో విడుదల చేయబోతుంది. ఈ మూవీ ని రష్యా లో జూలై 13 వ తేదీన విడుదల చేనున్నారు. ఈ సినిమాను ఏకంగా రష్యా లో 3000 స్క్రీన్ లలో విడుదల చేయనున్నారు. ఇలా భారీ ఎత్తున రష్యా లో విడుదల కానున్న ఈ సినిమా రష్యా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: