ఆదిపురుష్ కు బాసటగా నిలుస్తున్న్ సెలిబ్రిటీలు !

Seetha Sailaja
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ ఫలితం పై అందరిలోనూ ఆశక్తి ఉంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే చాలు 1000 కోట్ల కలక్షన్స్ ఖాయం అన్న అంచనాలు వస్తున్నాయి. ప్రస్తుతతరం ప్రేక్షకులు పురాణ కథలకు సంబంధించిన సినిమాలను చూడటం పూర్తిగా మానేశారు. ఇలాంటి పరిస్థితులలో అందరికీ తెలిసిన రామాయణ కథను ఎంతవరకు నేటితరం ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

‘పఠాన్’ సూపర్ హిట్ తో ఊపిరి పోసుకున్న బాలీవుడ్ ‘ఆదిపురుష్’ మూవీ హీరో దక్షిణాది ప్రాంతం వాడు అయినప్పటికీ ఈమూవీని నిర్మించింది దర్శకత్వం వహించింది టాప్ బాలీవుడ్ సెలెబ్రెటీలు కావడంతో ఈ మూవీ ఘనవిజయం బాలీవుడ్ ఘనవిజయంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య బాలీవుడ్ టాప్ హీరో రణబీర్ కపూర్ తన భార్య అలియా భట్ కలిసి ‘ఆదిపురుష్’ ఘనవిజయానికి తనవంతు సహాయం చేస్తున్నాడు.

ఈ మూవీకి సంబంధించిన 10వేల టిక్కెట్లు కొని ముంబాయి స్లమ్ ఏరియాలలో నివసించే పిల్లలకు ఉచితంగా ఇవ్వడమే కాకుండా తన భార్య అలియా భట్ సలహాతో ఆ స్లమ్ ఏరియాలోని పిల్లలకు ఐస్ క్రీమ్ లు కూడ ఇస్తున్నాడట. ఈ స్పూర్తితో కాబోలు టాలీవుడ్ కు చెందిన అభిషేక్ అగర్వాల్ ఇదే సినిమాకు చెందిన 10 వేల టిక్కెట్లు తెలంగాణ రాష్ట్రంలోని ఒల్దేజ్ హోమ్ లలో ఉన్నవారికి  అదేవిధంగా అనాధఆశ్రమంలో ఉంటున్న అనాధ పిల్లలకు ఈ మూవీ టిక్కెట్లు ఉచితంగా ఇమ్మని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా విడుదల కాకుండానే ఈ స్థాయిలో మ్యానియా ఉంటే ఈ మూవీ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బష్టర్ హిట్ అయితే ఆకాశమే హద్దుగా ఈ మూవీ కలక్షన్స్ ఉంటాయని అంటున్నారు. కొన్ని రోజులవరకు ఎటువంటి మ్యానియాను తెచ్చుకోలేకపోయిన ‘ఆదిపురుష్’ మూవీ ఒక్కసారిగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తరువాత ఏర్పడిన మ్యానియా అందరికీ షాక్ ఇచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: