"పొన్నియన్ సెల్వన్ 2" మూవీకి ఎన్ని కోట్ల నష్టమో తెలుసా..!

Pulgam Srinivas
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో మణిరత్నం ఒకరు. ఈయన తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇలా ఇండియా వ్యాప్తంగా దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అందులో మొదటి భాగం పోయిన సంవత్సరం భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి విజయం సాధించగా ... ఈ మూవీ యొక్క రెండవ భాగం తాజాగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ తమిళనాడులో 136.40 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.05 కోట్లు , కర్ణాటకలో 21.10 కోట్లు , కేరళలో 16.80 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 23.40  కోట్లు , ఓవర్సీస్ లో 126.10 కోట్ల కలక్షలను వసూలు చేసింది మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 163.50 కోట్ల షేర్ 338.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ వస్తువులు చేసింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమాకు 8.50 కోట్ల నష్టాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ps

సంబంధిత వార్తలు: