రాజమౌళి రాయబారానికి సమయం అడిగిన అమీర్ ఖాన్ !

Seetha Sailaja
రాజమౌళి సినిమాలో నటించే అవకాశం రావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. రజనీకాంత్ సూర్య అమితాబ్ లాంటి టాప్ హీరోలు తమకు రాజమౌళి సినిమాలలో నటించాలని ఉంది అంటూ ఓపెన్ గా గతంలో అనేక సందర్భాలలో చెప్పారు. అయితే ఈవిషయంలో అమీర్ ఖాన్ మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నట్లు టాక్.

రాజమౌళి సినిమాలలో విలన్ పాత్ర ఎలివేషన్ చాల ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో జక్కన్న సినిమాలలోని విలన్స్ హీరోల స్థాయికి మించి నటించడమే కాకుండా హీరో పాత్రకు విపరీతమైన పోటీ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న మహేష్ రాజమౌళిల మూవీ ప్రాజెక్ట్ లో విలన్ పాత్ర అత్యంత కీలకం అని తెలుస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా హాలీవుడ్ టెక్నిషియన్స్ తో రూపొందపోతున్న ఈ మూవీ కథ ఎక్కువగా ఆఫ్రికన్ అటవీ ప్రాంతం చుట్టూ తిరుగుతుందని టాక్.

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కంటే భారీ స్థాయి పెట్టుబడి ఈ మూవీ పై పెట్టవలసి వస్తోంది కాబట్టి అమీర్ ఖాన్ ఈమూవీలో విలన్ గా నటించడానికి అంగీకరిస్తే చాల సులువుగా ఈ మూవీని అన్ని భాషలలోను మార్కెట్ చేయవచ్చు అన్న ఆలోచన రావడంతో రాజమౌళి ప్రత్యేకంగా ముంబాయి వెళ్ళి అక్కడ అమీర్ ఖాన్ ను కలిసి తన ప్లాన్ ను వివరించినట్లు సమాచారం.

రాజమౌళి తీసుకు వచ్చిన ఈ రాయబారానికి అమీర్ ఖాన్ వెంటనే తన అంగీకారం తెలపకుండా తనకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి అని అడిగినట్లు గాసిప్పులు వస్తున్నాయి. నిజానికి అమీర్ ఖాన్ సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారుతున్నాయి అన్న విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతం గతంలోలా ప్రేక్షకులలో అమీర్ ఖాన్ పై చెప్పుకో తగ్గ స్థాయిలో క్రేజ్ లేదు. విలన్ పాత్రను మహేష్ తో కలిసి నటించడం వల్ల తనకు ఏమేరకు లాభం ఉంటుంది అన్న అంతర్మధనంలో అమీర్ ఖాన్ ఉన్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: