ప్రముఖ ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్న నాగచైతన్య కస్టడీ...!!

murali krishna
నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ యాక్షన్ సినిమా 'కస్టడీ'. కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా లో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి కస్టడీ సినిమా ను నిర్మించారు. ఇప్పటివరకు ఎక్కువగా లవర్‌ బాయ్‌ గానే నటించిన చైతన్య ఇందులో మొదటి సారి గా పోలీస్‌ గా కనిపించారు. మే 12 న థియేటర్లలో విడుదలైన కస్టడీ కు మిక్స్‌డ్‌ టాక్‌ అయితే వచ్చింది. తెలుగు తో పాటు తమిళ్‌లోనూ ఓ మోస్తరు గా మాత్రమే వసూళ్లు అయితే వచ్చాయి. అయితే కాప్‌ పాత్ర లో నాగచైతన్య యాక్టింగ్‌ అదిరిపోయింది. అలాగే సినిమా లోని యాక్షన్‌ సీక్వెన్స్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు టేకింగ్‌ చాలా బాగున్నాయని రివ్యూస్‌ కూడా వచ్చాయి. దీంతో అక్కినేని అభిమానులు కస్టడీ ఓటీటీ విడుదల కోసం ఆసక్తి గా అయితే ఎదురు చూస్తున్నారు.ఇప్పటికీ ఈ నిరీక్షణకు  తెరపడినట్లు తెలుస్తుంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 'కస్టడీ' స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు అయితే సొంతం చేసుకుంది. ఇక బుధవారం నాగచైతన్య ఓటీటీ విడుదల కు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈక్రమంలో జూన్‌ 9 నుంచే కస్టడీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్‌ అవుతోందని సమాచారం.
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో కస్టడీ అందుబాటులో ఉంది. ఈ మూవీలో తమిళ సీనియర్ నటుడు అరవింద్ స్వామి ప్రధాన పాత్ర పోషించగా.. వెన్నెల కిషోర్, సంపత్ రాజు, శరత్ కుమార్, ప్రియమణి మరియు ప్రేమ్‌జీ అమరన్ తదితరులు ముఖ్య పాత్రల లో కనిపించారు. అలాగే ఈ చిత్రానికి ఇళయరాజా మరియు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరి థియేటర్లలో కస్టడీ ను మిస్‌ అయినవారు ఓటీటీ లో చూసి ఎంజాయ్‌ చేయవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: