సినిమాల్లోకి రాకముందు.. వెన్నెల కిషోర్ ఏం చేసేవాడో తెలుసా?

praveen
నేటితరం కమెడియన్స్ గురించి మాట్లాడుకుంటే మొదట వినిపించే పేరు వెన్నెల కిషోర్. ఇక ఎలాంటి పాత్రలోనైనా సరే పరకాయ ప్రవేశం చేసి తన తైన శైలిలో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలడు అని చెప్పాలి. అయితే కామెడీ కింగ్ బ్రహ్మానందం సినిమాలు చేయడం తగ్గించిన తర్వాత అటు ఇండస్ట్రీలో వెన్నెల కిషోర్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది అని చెప్పాలి. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల సినిమాల్లోనూ ఛాన్సులు దక్కించుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నాడు అని చెప్పాలి.

 మొన్నటి వరకు సినిమాలో కమెడియన్ గా కనిపించి ప్రేక్షకులను అలరించిన వెన్నెల కిషోర్.. ఇక ఇటీవలే హోస్ట్ గా కూడా అవతారం ఎత్తాడు. ప్రముఖ టీవీ షోలో అలా మొదలైంది అని ఒక టాక్ షో నిర్వహిస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలను తన షో కి గెస్ట్లుగా పిలిచి ఎంటర్టైన్మెంట్ అందించాడు.  ఇక ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది అనడంలో సందేహం లేదు. ఇలా ఒక వైపు సినిమాల ద్వారా మరోవైపు ఇక బుల్లితెరపై హోస్టుగా కూడా అదరగొడుతున్నాడు. అలాంటి వెన్నెల కిషోర్ ఇక సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవుతారు.

 నిజాంబాద్ జిల్లాలోని కామారెడ్డి లో ఒక మధ్య తరగతి కుటుంబంలో వెన్నెల కిషోర్ పుట్టాడు. అయితే అమెరికాలోని మాస్టర్స్ పూర్తి చేసిన  కిషోర్ వర్జిన్యాలోని థామ్సన్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్వేర్ టెస్టర్ గా ఉద్యోగం సంపాదించాడు. మంచి జీతం.. బాగానే సెటిల్ అయ్యాడు.  ఇక ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు  అయితే వర్జినియాలో ఎన్నారై లకు నెల జీతంతో కూడిన సెలవు కూడా ఇచ్చేవారు. ఈ సెలవుల్లో వెన్నెల కిషోర్ సినిమాలపై ఉన్న పిచ్చితో వెన్నెల అనే మూవీకి దేవకట్ట దగ్గర సహాయకుడిగా పనిచేశారు. అయితే ఈ సినిమాలో ఖాదర్ పాత్రలో నటించాల్సిన శివారెడ్డికి వీసా కుదరకపోవడంతో అనుకోకుండా.. ఇక ఆ పాత్ర వెన్నెల కిషోర్ కి దక్కింది. సినిమా హిట్ కావడంతో తన తొలి సినిమా నే అతని ఇంటిపేరుగా కూడా మారిపోయింది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోనే కంటిన్యూ అయ్యాడు వెన్నెల కిషోర్. ఇప్పుడు స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: