ఎన్టీఆర్... ప్రశాంత్ నిల్ కాంబోలో రూపొందబోయే మూవీలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ దర్శకుడు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇలా ఈ మూవీ లో హీరోయిన్ మరియు విలన్ పాత్రల్లో నటిస్తున్న ఇద్దరు కూడా బాలీవుడ్ వారే కావడంతో ఈ సినిమాపై తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండగా ... రత్న వేలు సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ ... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 31 వ మూవీ గా రూపొందిపోతుంది ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.

ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ... ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయింది. ఈ మూవీ రెండవ భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తో ఈ దర్శకుడు చేయబోయే సినిమా ప్రారంభం అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ దర్శకుడు ఎన్టీఆర్ సినిమాకు హీరోయిన్ ని పిక్స్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే  సినిమాలో ప్రియాంక చోప్రా ను హీరోయిన్ గా ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: