అందుకే ఆ స్టార్ హీరో మూవీని రిజెక్ట్ చేశా అంటున్న శ్రియ.!

Divya
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరన్ ఒకప్పుడు ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ,బాలకృష్ణ, తరుణ్, నాగార్జున, ప్రభాస్ వంటి హీరోలతో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ . అంతేకాదు స్టార్ హీరోల సరసన స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఒక టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.
అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా చలామణి అయిన ఈమె అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఫ్యామిలీ లైఫ్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. అందరి హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న అవకాశం వస్తే కాదని రిజెక్ట్ చేసిందట. ఇక ఆ హీరో ఎవరు ఎందుకు ఆయనతో నటించలేదు అనే విషయానికి వస్తే.. ఆ హీరోతో నటించే అవకాశం వచ్చినా సరే ఆమె కావాలని రిజెక్ట్ చేసిందని అందుకు ప్రధాన కారణం ఆ హీరో శ్రియా కంటే పొట్టిగా ఉండడమే నట.. హీరో పొట్టిగా ఉన్న కారణంతో తెరపై వీరిద్దరూ కలిసి నటిస్తే అక్క తమ్ముడు గా కనిపిస్తారని,  అందుకే ఆ హీరోతో కలిసి నటించడానికి ఇష్టపడలేదని ఆ రీసన్ తప్పితే ఆ హీరో నటించకపోవడానికి మరో కారణం ఏమీ లేదు అంటూ దర్శక నిర్మాతలకు కూడా క్లారిటీ ఇచ్చిందట.
దీంతో మరొకసారి శ్రియ పేరు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా  మారింది.. ఇక పోతే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది అలాగే తన గ్లామర్ ఫోటోషూట్లను నిత్యం   షేర్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. మొత్తానికి అయితే శ్రియ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: