తమిళ
సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో
శివ కార్తికేయన్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన
సినిమా లలో
హీరో గా నటించి
తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ నటుడు ఈయన నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో
వరుణ్ డాక్టర్ ... కాలేజ్ డాన్ సినిమాలు
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాలను సాధించడంతో ఈ
హీరో క్రేజ్
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన రీతిలో పెరిగింది.
ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ నటుడు
ప్రిన్స్ అనే
కామెడీ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ
మూవీ కి అనుదీప్ కే
వి దర్శకత్వం వహించగా ...
సత్యరాజ్ ఈ
మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఈ
సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు మా వీరన్ అనే
తమిళ సినిమాలో హీరోగా నటించాడు. ఈ
మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ
మూవీ ని
మహా వీరుడు పేరుతో విడుదల చేయనున్నారు.
ఈ సినిమాను జూలై 14 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన పనులను ఫుల్ స్పీడ్ లో పూర్తి చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఈ
మూవీ హీరో శివ కార్తికేయన్ పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ కి మడోనే అశ్విన్ దర్శకత్వం వహించాడు.