ఆదిపురుష్: రెబలోడి క్రేజ్ మాములుగా లేదుగా?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని చూడ్డానికి ఎంత దూరమైనా వెళ్తాం. ఎంత ఖర్చయినా భరిస్తాం అంటూ తిరుపతి వీధుల్లో కిక్కిరిసిపోయారు రెబల్ ఫ్యాన్స్. రెబల్ స్టార్ ప్రభాస్‌కి బాహుబలి లాంటి పర్ఫెక్ట్ హిట్‌ వస్తే చూడాలన్నది వారి కోరిక.అది కూడా ఆదిపురుష్‌తో నెరవేరాలన్నది వాళ్ల ఆకాంక్ష. శ్రీ రాముడి కథతో తెరకెక్కిన ఆదిపురుష్‌ భారీ విజయం అందుకోవడం ఖాయం అంటున్నారు రెబల్ ఫ్యాన్స్. ప్రభాస్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ మూవీగా ప్రొజెక్ట్ అవుతోంది ఆదిపురుష్‌.పైగా ఆయన నటిస్తున్న తొలి పౌరాణిక ఇది.ఇండియాలో రాముడి కథలు ఎప్పుడూ నిరాశపరచలేదు. అందుకే అదే నమ్మకంతో ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో రామకథను ప్రెజెంట్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్‌. త్రీడీలో తెరకెక్కుతోంది ఆదిపురుష్‌ సినిమా. నెవర్‌ బిఫోర్‌ అన్నట్టు వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్.


ఇక అన్నీ పర్ఫెక్ట్ టైమ్‌కి జరిగి ఉంటే ఈ పాటికే విడుదల కావాల్సింది ఆదిపురుష్‌. కానీ అయోధ్య సిటీ వేదికగా విడుదలైన టీజర్‌ క్వాలిటీ చూసుకున్నాక, రిలీజ్‌ విషయంలో కాస్త నెమ్మదించారు మూవీ మేకర్స్.ఇది రామకథ కాబట్టి క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ కాకూడదనుకున్నారు. కొంచెం ఎక్కువ సమయం పట్టినా ఫర్వాలేదు, ఈ సినిమా భావితరాలకు గుర్తుండిపోయే ఇవ్వాలనుకున్నారు. ఆ కృషి, ఆ పట్టుదల రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో కనిపించింది.ఆల్రెడీ విడుదలైన ట్రైలర్‌కి ఇంకా పాటలకూ మంచి స్పందన వస్తోంది. తిరుపతిలో వైభవంగా జరుగుతున్న ప్రీ రిలీజ్‌ వేడుకలో రెండో ట్రైలర్‌ ని కూడా విడుదల చేయనున్నారు.బాహుబలి, సాహో సినిమాల తర్వాత బంపర్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ప్రభాస్‌కి ఆదిపురుష్‌ ఆ రేంజ్‌ హిట్‌ తెచ్చిపెట్టాలన్నది అభిమానుల ఆశ. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు డైరక్టర్‌ ఓం రౌత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: