తిరుపతిలో ప్రభాస్ ని చూడడానికి ఎగబడుతున్న ఫ్యాన్స్..!!

Divya
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జూన్ 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. ఈరోజు సాయంత్రం తిరుపతిలో జరగబోతోంది. అందుకు సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఒకరోజు ముందుగానే తిరుపతికి చేరుకున్న ప్రభాస్ మంగళవారం తెల్లవారు జామున తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడం జరిగింది.

అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సైతా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాగే ఈరోజు సాయంత్రం జరిగే ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ ని చూడాలని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఉన్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించారు టి సిరీస్ బ్యానర్ పై ఈ సినిమాని దాదాపుగా రూ .450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. శ్రీరాముని అవుచిత్వాన్ని వీరత్వాన్ని ప్రపంచానికి ఆవిష్కరించే విధంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ తెరకెక్కించారు.
పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ప్రభాస్ తోపాటు ఆది పురుష్ చిత్రంలో సీత పాత్ర లో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండగా లక్ష్మణుడే పాత్రలు సన్నీ సింగ్ నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని త్రీడీ ఐమాక్స్ 3d ఫార్మాట్ లలో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని అభిమానులు సినీ ప్రేక్షకుల సైతం తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పలు అప్డేట్ల సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: