"బ్రో" "ఈగల్" "టిల్లు స్క్వేర్" మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న "బ్రో" మూవీ ... అలాగే మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందుతున్న "ఈగల్" మూవీ ... సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ మూవీ లు షూటింగ్ దశలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ లోకు సంబంధించిన షూటింగ్ లు ఎక్కడ జరుగుతున్నాయి ... ప్రెసెంట్ వాటి స్టేటస్ ఏమిటో తెలుసుకుందాం.

బ్రో : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తుంది. ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందుతుంది.

ఈగల్ : రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ రవితేజ పై ఈ సినిమా లోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

టిల్లు స్క్వేర్ : సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం సిద్దు పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: