సుధీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ ఆర్టిస్ట్....!!
ఈ షో ద్వారా పరిచయమైనా ఎంతో మంది కమెడియన్స్ నేడు, స్టార్ కమెడియన్స్ గా మరియు హీరోలు గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. వారిలో మనం ప్రధానం గా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్ గురించి. ఇతను ఇండస్ట్రీ లోకి రాకముందు ఎన్ని కష్టాలను అనుభవించాడో ఆయన మాటల్లోనే ఎన్నో సార్లు విన్నాము. ఆకలి తో కడుపు నింపుకోవడానికి డబ్బులు లేక, ట్యాప్ నీళ్లు త్రాగి బ్రతికిన రోజులు కూడా ఉన్నాయి. తనకి తెలిసిన మ్యాజిక్ షోస్ ని చేసుకుంటూ, ఆ వచ్చిన డబ్బులతో జీవించే అతి సాధారణమైన మనిషి సుడిగాలి సుధీర్. అలాంటి సుధీర్ కి జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం దక్కింది.
అప్పటికే ఇండస్ట్రీ లో స్థిరపడి ఉన్న ప్రముఖ కమెడియన్ వేణు , జబర్దస్త్ లో కూడా కొంత కాలం పనిచేసాడు. ఆయన టీం లో స్కిట్స్ చేస్తూ వచ్చిన సుడిగాలి సుధీర్, ఆ తర్వాత టీం లీడర్ గా మారి ఎన్నో అద్భుతమైన స్కిట్స్ చేసి అతి తక్కువ సమయం లోనే ఒక మీడియం రేంజ్ హీరో కి ఉండాల్సింది ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని దక్కించుకున్నాడు. జబర్దస్త్ లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న తర్వాత సుడిగాలి సుధీర్ కి ఈటీవీ లో అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి. ఒకానొక దశలో ఆయన లేని ఎంటర్టైన్మెంట్ షో అనేదే ఉండేది కాదు. ఆ స్థాయి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అలా బుల్లితెర పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్ ని నచ్చి, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కూడా ఆయనకి అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. అలా కమెడియన్ గా పలు సినిమాల్లో నటించిన సుడిగాలి సుధీర్, ఆ తర్వాత హీరో గా కూడా చెయ్యడం ప్రారంభించాడు. తొలి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, రీసెంట్ గా 'గాలోడు' మూవీ తో మంచి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా, సుడిగాలి సుధీర్ ఈటీవీ ఛానల్ ని వదిలి వెళ్లిపోయిన తర్వాత, హైపర్ ఆది ఆయన స్థానాన్ని ఆక్రమించుకొని నెంబర్ 1 స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే, అయితే ఆయన రీసెంట్ గా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ 'సుడిగాలి సుధీర్ వల్ల మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కి క్రేజ్ రాలేదు, సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యిందే మేము ఆయన మీద వేసే పంచుల ద్వారా, లేకపోతే ఈ స్థాయి లో ఉండేవాడు కాదు' అంటూ హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారింది.