చిరంజీవికి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన దర్శకుడితో మూవీ చేయనున్న బాలకృష్ణ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో బాబి ఒకరు. ఈయన మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన పవర్ మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ , జై లవకుశ , వెంకీ మామ సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందినటువంటి వాల్తేరు వీరయ్య అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బాబి రేంజ్ కూడా అమాంతం పెరిగి పోయింది. ఇలా వాల్టేర్ వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ దర్శకుడి తదుపరి మూవీ పై ప్రేక్షకులు మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడి తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని నందమూరి నట సింహం బాలకృష్ణ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ , బాబీ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఇంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: