ఐరన్ లెగ్ హీరోయిన్ కోసం.. అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడు?

praveen
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్ని నెల నుంచి కూడా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  పుష్ప సినిమాలో లాక్ అయిపోయాడు అనే విషయం తెలిసిందే. అయితే అప్పటివరకు టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా కొనసాగిన అల్లు అర్జున్ ఇక పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన  పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్కసారిగా అన్ని ఇండస్ట్రీలకు సుపరిచితుడుగా మారిపోయాడు. ఇక ఇప్పుడు పుష్ప సీక్వెల్ గురించి  అన్ని భాషల ప్రేక్షకులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.

 అయితే ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా అల్లు అర్జున్.. తర్వాత ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడు అన్న విషయంపై మాత్రమే ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాలో ఐరన్ లెగ్ హీరోయిన్ కి అవకాశం ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి అని చెప్పాలి. ఇంతకీ అల్లు అర్జున్ అవకాశం ఇవ్వబోయే హీరోయిన్ ఎవరో తెలుసా.. పూజా హెగ్డే. అయితే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇక నటీనటుల్లో ఉండే టాలెంట్ ను బట్టి అల్లు అర్జున్ ఎక్కువగా తన సినిమాల్లో అవకాశం ఇవ్వడం చూస్తూ ఉంటాం.

 ఇక గతంలో అల్లు అర్జున్ సరసన అలా వైకుంఠపురంలో సినిమాలో పూజ హెగ్డే నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఇక ఇటీవల కాలంలో మాత్రం పూజా హెగ్డే అన్ లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ఆమె చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో ఐరన్ లెగ్ హీరోయిన్ అంటూ ముద్ర పడింది. ఇక అలాంటి హీరోయిన్ కి ప్రస్తుతం తెలుగులో అంతగా ఆఫర్స్ కూడా లేవు. త్రివిక్రమ్ తప్ప ఎవరు ఆమెను పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లాప్ హీరోయిన్ కి ఇప్పుడు తన తర్వాత సినిమాలో ఛాన్స్ ఇవ్వబోతున్నాడట అల్లు అర్జున్. తనకు నచ్చిన హీరోయిన్ కోసం ఏకంగా తన కెరీయర్ని అల్లు అర్జున్ రిస్కులో  పెట్టుకున్నాడంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: