అప్పట్లో రంభ క్రేజ్ ఎలా ఉండేదంటే?

Purushottham Vinay
సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన హాట్ నెస్ తో అప్పట్లో యూత్ గుండెల్లో గుడి కట్టుకుంది. ముఖ్యంగా రంభ డాన్స్ కి పెద్ద హీరోలు కూడా పోటీ పడలేకపోయేవారు. రంభ పేరు వినగానే మన తెలుగు వాళ్లకి "ఆంటీ కూతురా.." పాట ఖచ్చితంగా గుర్తొస్తుంటుంది.ఆ పాట అప్పట్లో జనాలని ఓ ఊపు ఊపేసింది.ఈ హాట్ బ్యూటీ అసలు పేరు విజయలక్ష్మి యీడి. ఆమె జూన్ 5, 1976 వ సంవత్సరంలో జన్మించింది.ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో హిట్ సినిమాలు చేసింది. అంతేగాక రికార్డులు కూడా క్రియేట్ చేసింది. మొత్తం ఏడు ప్రాంతీయ భాషలలో నటించిన నటిగా రికార్డు కెక్కింది. తెలుగులో చిరంజీవి, బాల కృష్ణ, నాగార్జున ఇంకా వెంకటేష్ వంటి పెద్ద స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి డాన్స్ దుమ్ముదులిపింది.


ఇక నేడు తన 47 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.2008 వ సంవత్సరం తర్వాత తెలుగు తెరపై రంభ కనిపించలేదు.2010 వ సంవత్సరం వరకు తమిళ, మలయాళ సినిమాలో రంభ నటించింది. ఇక 2010 వ సంవత్సరంలో శ్రీలంక దేశానికి చెందిన బిజినెస్ మెన్ ఇంద్రకుమార్ పద్మనాధన్ ను పెళ్లి చేసుకుని లైఫ్‌ లో సెటిల్ అయింది.ఇక కెనడాలో సెటిల్ అయిన రంభ ఇద్దరు కూతుళ్లు ఇంకా ఒక కొడుకు వున్నారు. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు చాలా యాక్టివ్ గా వుంటుంది రంభ. అంతేగాక తన ఫ్యామిలీ పోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ వుంటుంది. ఇక తన పిల్లలు పెద్దవాళ్లు కావటంతో రంభ కూడా రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తుంది. ఈ మధ్య కొన్ని డ్యాన్స్ షోస్ కి కూడా జడ్జ్‌ గా వచ్చింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో రంభ నటిస్తుందనే వార్తలు ఫిల్మ్‌ సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: